చికిత్స పొందుతూ ఎలక్ట్రిషియన్ మృతి
NLR: బోగోలులో విద్యుత్ పనులు చేస్తుండగా షాక్‌కి గురై ఎలక్ట్రిషియన్ షేక్ రసూల్ (61) మృతి చెందారు. ఈ నెల 11న బోగోలులోని బ్రహ్మంగారిమఠం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్యూజ్ సరిచేస్తుండగా ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు అతన్ని చెన్నైలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. బుధవారం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు.