గాల్లోకి కాల్పులు.. ఆరుగురు పోలీసుల సస్పెండ్

గాల్లోకి కాల్పులు.. ఆరుగురు పోలీసుల సస్పెండ్

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసిన ఘటన బీహార్ పాట్నాలో జరిగింది. బోరింగ్ కెనాల్ రోడ్డులో పార్కింగ్ విషయంపై వివాదం నెలకొనడంతో SUVలో ఉన్న వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విన్న ఏడీజీ సెక్యూరిటీ కూడా కాల్పులు జరపడంతో వాహనంలోని వ్యక్తులు పారిపోయారు. వీరి కోసం గాలిస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన అధికారులను సస్పెండ్ చేశారు.