నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల తరువాత నేతల ప్రచారాలు, మైకులు బంద్‌తో పాటు పలు ఆంక్షలు నియోజకవర్గంలో ప్రారంభంకానున్నాయి. పోలింగ్‌కు 48 గంటలు మాత్రమే సమయం ఉండడంతో కాంగ్రెస్, BJP, BRS ప్రచారంలో వేగవంతం పెంచాయి. ప్రతి పోలింగ్ కేంద్రం, డివిజన్ వారీగా లెక్కలు వేస్తూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాయి.