వైద్య చరిత్రలో మరో కొత్త అధ్యాయం
వైద్య చరిత్రలో మరో కొత్త అధ్యాయం లిఖితమైంది. మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను ఢిల్లీ ద్వారకాలోని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ప్రారంభించారు. మరణించిన ఆమె అవయవాలు దానే చేసేందుకు వీలుగా ఈ ప్రక్రియను చేపట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆసియాలోనే ఈ ఘనతను సాధించిన మొదటి ఆసుపత్రి తమదేనని ఛైర్మన్ డా. శ్రీకాంత్ శ్రీనివాసన్ చెప్పారు.