నగరానికి హరియాణా దున్నరాజులు

నగరానికి హరియాణా దున్నరాజులు

HYD: నగరంలో సదర్ సందడి మొదలైంది. దీపావళి తర్వాత రెండో రోజు యాదవ సోదరులు ఈ సదర్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. సదర్ కోసం ఇప్పటికే హరియాణా నుంచి దున్నరాజులను సిటీకి తెప్పించారు. సదర్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హరిబాబు మాట్లాడుతూ.. బాన్షా, రోలెక్స్, బజరంగి, గోలు, కోహినూర్ పేర్లతో ఉన్న ఈ దున్నరాజులు 7 అడుగుల ఎత్తుతో అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు.