జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
ప్రకాశం: జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 అథ్లెటిక్స్‌లో మార్కాపురం బాలురు సత్తా చాటారు. జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న మహేష్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించారు. అజయ్ 400, 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.