మడకశిరలో యూరియా బ్యాగులు పంపిణీ

సత్యసాయి: మడకశిర మండలంలోని కదిరేపల్లి, అనంతపురం, భక్తరహళ్లి రైతుసేవ కేంద్రాల్లో రైతులకు యూరియా బ్యాగులు పంపిణీ చేసినట్లు ఏవో తిమ్మప్ప తెలిపారు. సుమారు 450 మంది రైతులకు ఈ యూరియా బ్యాగులు పంపిణీ చేశామని, మిగతా చోట్ల కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.