'గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి'

SS: పట్నం పోలీస్ స్టేషన్ ఎస్సై జయరాం నాయక్ మంగళవారం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. చెరువులు, కుంటల వద్దకు చిన్నపిల్లలను తీసుకెళ్లరాదని హెచ్చరించారు. నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.