వేసవి సెలవుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

MDK: వేసవి కాలం సెలవులు ప్రారంభమైనందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పెళ్లిళ్లు, స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదే అదునుగా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆయా ఏరియాల్లో అనుమానితుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.