నరసింహకొండ ఆలయ విశేషాలు ఇవే..!

NLR: నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 6 నుండి ప్రారంభం కానున్నాయి. నెల్లూరు పట్టణం నుండి దాదాపుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ కొండల మధ్య ఈ ఆలయం నెలకొని ఉంటుంది. భక్తులకు, పర్యాటకులకు ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏడు కోనేరులు నేటికీ ఉండటం చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు.