VIDEO: మండలంలో దంచికొట్టిన వర్షం

SKLM: ఆమదాలవలస మండల పరిధిలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఆకాశమంత ఒక్కసారిగా మేఘావృతమై చల్లని గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఎండ వేడి, ఉక్కపోతతో సతమతమైన మండల ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఖరీఫ్ సీజన్లో వరి పంటకు సిద్ధమవుతున్న వేళ ఈ వర్షం ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.