రౌడీషీటర్లకు బంగారుపాళ్యం సీఐ వార్నింగ్

CTR: వినాయక చవితి, నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలు కాపాడే లక్ష్యంతో బంగారుపాళ్యం పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సీఐ కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా ఎవరైనా గొడవలు సృష్టించినా, నేరపూరిత చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.