'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'
JGL: భారీ వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు నాగం శివకుమార్ అన్నారు. భీమారం మండలం దేశాయిపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం ప్రారంభించి వారం రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం తడిసిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.