VIDEO: మాకు ప్రాణహాని ఉంది.. ప్రేమ జంట

VIDEO: మాకు ప్రాణహాని ఉంది.. ప్రేమ జంట

KKD: ప్రేమ వివాహం చేసుకున్న తమకు తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందంటూ ఓ ప్రేమ జంట గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను ఆశ్రయించింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులు, సోదరుల నుంచి తమకు హాని ఉందంటూ సర్పవరానికి చెందిన యాళ్ల రమ్య జిల్లా ఎస్పీకి వివరించింది. మేజర్‌ అయిన తాను, నవర గ్రామానికి చెందిన వాకపల్లి సాయి గణేష్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామన్నారు.