'టమాటా నేలపాలు కాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం'

'టమాటా నేలపాలు కాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తాం'

AKP: నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఏఎల్.పురం రైతు మార్కెట్‌ను సందర్శించారు. టమాటాకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించారు. టమాటా నేలపాలు కాకుండా గిట్టుబాటు ధర కల్పించేందుకు నర్సీపట్నం, విశాఖపట్నం హోటళ్లు మార్కెట్ వ్యాపారులతో చర్చించి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.