ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహ ఆవిష్కరణ

కృష్ణా: ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహ ఆవిష్కరణను మచిలీపట్నం జిజిహెచ్ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగెల్ విగ్రహాన్ని గనుల, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవను మంత్రి కొనియాడారు.