పోలేరమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజలు

KDP: కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం సన్నిధిలో గల పోలేరమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం పూర్వపు పీఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి కుమారుడు వెంకటాద్రి సతీసమేతంగా పోలేరమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపారు.