నేటి నుంచి బీసీ గురుకులాల్లో దరఖాస్తులు

నేటి నుంచి బీసీ గురుకులాల్లో దరఖాస్తులు

MBNR: బీసీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థ ప్రకటన జారీ చేసింది. ఇంటర్ పూర్తయినవారు అన్‌లైన్‌లో MJPTBCWREIS ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఒక్కో కోర్సుల్లో 40 సీట్లు అందుబాటులో ఉండగా, బీకాం(సీఏ)లో మాత్రం 80 ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.