మల్హర్: జెట్ విమానం ఆచూకి తెలిసింది

కరీంనగర్: గత నాలుగు రోజులుగా కాటారం ,మల్హర్ మండలాల పరిధిలో ఆకాశంలో అత్యంత సమీపంలో చక్కర్లు కొడుతున్న జెట్ విమానం ప్రజలను అయోమయానికి గురి చేసిన విషయం విధితమే. అయితే జెట్ విమానంపై అధికారులను ఆరా తీయగా సమాచారం తెలిసింది. చత్తీస్గఢ్ లోని కాంకెడ్ ఎయిర్పోర్ట్ అకాడమిలో పెట్టిన ట్రైనింగ్ నేపధ్యంలో జెట్ ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిపారు. దీంతో ఊహగానలకు తెరపడింది.