ఆలయంలో పూజలు నిర్వహించిన టీటీడీ బోర్డు సభ్యుడు
RR: షాద్ నగర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాకుంభ ప్రోక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు.