'నిడదవోలు నియోజకర్గంలో రహదారులకు మోక్షం'

E.G: నిడదవోలు నియోజకవర్గంలోని రహదారులకు మోక్షం లభించింది. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 5.10 కోట్లను విడుదల చేసిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎర్రచెరువు-వేమవరం, వడ్లూరు-తీపర్రు, తీతలి-మునిపల్లి, రోడ్లకు మరమ్మతులు చేస్తామన్నారు. ఈ సందర్భంగా CM, డిప్యూటీ CM, R&B మంత్రికి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.