మునుగోడులో చిరుత సంచారం
NLG: మునుగోడు మండలం చెల్లేడు గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. సుమారు 20 రోజుల క్రితం అది పరిగెడుతుండగా పత్తి కూలీలు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు ఒక గొర్రెను అది తిన్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో గ్రామానికి చేరుకుని పులి ముద్రల కోసం వెలుకుతున్నారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాభ్రంతులకు గురవుతున్నామని పేర్కొన్నారు.