'గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి'

PDPL: గణేష్ నవరాత్రుత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ పుల్ల కరుణాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎంబి గార్డెన్‌లో మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్టాపనకు ఆన్‌లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.