జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

BDK: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు మహంతి వెంకట కృష్ణా, గాలి రామ్మోహన్ రావు బంగారు పతకాలు సాధించారు. వీరు జులై 22 నుండి 26 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగే జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.