మేడారం గద్దెల వద్ద జారిపడిన రాతి శిల

మేడారం గద్దెల వద్ద జారిపడిన రాతి శిల

TG: ములుగు జిల్లా మేడారంలోని వన దేవతల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనుల వద్ద రాతిశిల జారిపడి ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పూజారి సిద్ధబోయిన రాణా రమేష్ బుధవారం మేడారానికి వచ్చిన ప్రముఖులకు దేవతల దర్శనం చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయన కుమారుడు యూవిన్‌ నిర్మాణంలో ఉన్న రాతి శిలపై కూర్చున్నాడు. శిల జారడంతో యూవిన్‌ కిందపడ్డాడు. అతడి కాలు నుజ్జునుజ్జయింది.