“ఎంజాయ్ పేరుతో గంజాయ్ వద్దు" నినాదంతో అవగాహన
MNCL: సామాజిక రుగ్మతలకు మూలకారణమైన గంజాయి, డ్రగ్స్ కు యువత బానీసలవుతున్నారని CPI జిల్లా కార్యదర్శి R.లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ప్రజానాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో “ఎంజాయ్ పేరుతో గంజాయ్ వద్దు" అనే నినాదంతో మంచిర్యాలలో అవగాహన ప్రోగ్రామ్ నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకు బస్ జాత చేపడుతున్న ప్రజా నాట్య మండలిని అభినంధించారు.