నంది మేడారంలో బడిబాట సన్నాహక సమావేశం
PDPL: ధర్మారం మండలం నంది మేడారం జడ్పీ హైస్కూల్లో ఇవాళ ముందస్తుగా బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని ఎంఈఓ ప్రభాకర్, హెచ్ఎం వసంత సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత దుస్తులు, పుస్తకాలు, విద్యార్థి కిట్లు, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నట్లు సర్పంచ్ వీర్పాల్ తెలిపారు.