చౌటుప్పల్ వద్ద ఫ్లైఓవర్?

BHNG: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి నుంచి చౌటుప్పల్ ప్రజలకు తొందర్లోనే ట్రాఫిక్ అలాగే ప్రమాదాల నుంచి ఉపశమనం కలగనుంది. 375కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణానికి వచ్చేనెలలో శంకుస్థాపన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైవేకి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డుని చదును చేసి ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.