ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో డ్రైవర్ మృతి

WGL: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో చోటు చేసుకుంది. ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కట్ర్యాలకు చెందిన ఇటికుల రవి (40) అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో మృతి చేందాడు.