మిషిగన్‌లో హింసాత్మక దాడులకు కుట్ర?

మిషిగన్‌లో హింసాత్మక దాడులకు కుట్ర?

అమెరికాలో హాలోవీన్ వీకెండ్ సందర్భంగా మిషిగన్‌లో హింసాత్మక దాడులకు కుట్ర పన్నినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు FBI డైరెక్టర్, భారత సంతతి నేత కాశ్ పటేల్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కాగా హాలోవీన్ వేడుకలను US సహా అనేక దేశాల్లో OCT 31న జరుపుకుంటారు.