దమ్మపేట మండలంలో 26.65% పోలింగ్ నమోదు

దమ్మపేట మండలంలో 26.65% పోలింగ్ నమోదు

BDK: దమ్మపేట మండల పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉదయం 9 గంటల సమయానికి 26.65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని అన్నారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.