అక్రమాలకు పాల్పడిన హౌసింగ్ సిబ్బందిపై వేటు

అక్రమాలకు పాల్పడిన హౌసింగ్ సిబ్బందిపై వేటు

NLR: వెంకటాచలం హౌసింగ్ శాఖలో గతంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై కలెక్టర్ ఓ.ఆనంద్ వేటు వేశారు. ఆ శాఖలో పనిచేసే ఏఈ వెంకటేశ్వర్లు, వడ్డీపాలెం సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చక్రవర్తిని కూడా సస్పెండ్ చేశారు. వడ్డీపాలెంలో గిరిజనులు ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో పాత ఇళ్లే చూపించి ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నిధులు స్వాహా చేశారు.