సిద్ధవటంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం
కడప: సిద్ధవటం మండలం భాకరాపేటలో వెలసిన శ్రీ భవాని శంకర్ ఆలయంలో గురువారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజారులు సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.