'నేడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్'

'నేడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్'

తిరుపతిలో తెలుగుగంగ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఇవాళ తాగునీటి సరఫరా నిలిచిపోతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. లీలా మహల్ పంపింగ్ స్టేషన్ నుంచి పళని ఈఎల్ఎస్‌ఆర్ వరకు ఉన్న పైప్‌లైన్ పనుల కారణంగా రాయల్ నగర్, భైరాగి పట్టెడ, ఎస్టీవీ నగర్, కేసవాయనగుంట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ మేరకు ఆ ప్రాంత వాసులు సహకరించాలని కోరారు.