'సమస్యలు లేని నియోజకవర్గంగా మారుస్తాం'
TPT: చంద్రగిరిని నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గురువారం ఆయన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ఆయన నేరగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.