ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ కలెక్టర్
JGL: ఎండపెల్లి మండలం కేంద్రం, గుల్లకోట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బీ. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వేగంగా, పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు. తేమశాతం, తూకం, నాణ్యత ప్రమాణాలపై సమీక్షించి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలని సూచించారు.