చందాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

చందాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

SRD: హత్నూర మండలం చందాపూర్‌లో ఎంపీ రఘునందన్ రావు నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను గ్రామ నూతన పాలకవర్గం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల నుంచి భవాని మాత గుడి వరకు 300 మీటర్ల మేర ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో త్వరలోనే సీసీ రోడ్ల పనులు పూర్తి చేస్తామని సర్పంచ్ రామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజా మల్లారెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.