ఓటర్ చైతన్య కరపత్రం ఆవిష్కరించిన RDO
WGL: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలకు వజ్ర ఆయుధం లాంటిదని నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అన్నారు. మంగళవారం సత్యం సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభలకు లొంగకుండా స్వచ్ఛంధంగా ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.