తెనాలిలో ఆదివారం విద్యుత్ బిల్లుల చెల్లింపులు: డీఈఈ

తెనాలిలో ఆదివారం విద్యుత్ బిల్లుల చెల్లింపులు: డీఈఈ

GNTR: తెనాలి డివిజన్ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు ఆదివారం కూడా పనిచేస్తాయని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్ కుమార్ తెలిపారు. వినియోగదారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు. మొబైల్ యాప్‌లు లేదా యూపీఐ (ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా కూడా చెల్లించవచ్చని, సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.