వైభవంగా ప్రారంభం అయిన కనుక మహాలక్ష్మి ఉత్సవాలు
AKP: ఎలమంచిలిలో కనకమహాలక్ష్మి అమ్మవారి మాసోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. మహిళలు బిందెలతో నీళ్లు తీసుకువచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేశారు. ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు తెలిపారు. నేటి నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం హరికథ కాలక్షేపం జరుగుతుందన్నారు.