చికిత్స పొందుతూ యువకుడు మృతి
MDK: చేగుంట మండలం ఉల్లి తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన ఆత్కూరి బాబు (26) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బిక్యా నాయక్ తెలిపారు. గత నెల 21న కూలీ పనులు చేసుకునే బాబు మద్యం మత్తులో గుర్తుతెలియని పురుగుల మందు సేవించాడు. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వివరించారు.