ఆహార భద్రత నియమాలు పాటించాలి

SKLM: ఆహార భద్రత నియమాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని జెసి ఫర్మాన్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆహార భద్రత నియమాలు పాటించని వ్యాపారులపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేసి రూ.1,20,000/-లు జరిమానా విధించినట్లు వివరించారు. ఆహార పదార్థాల తయారీ, అమ్మకాలు చేసే వారు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.