నేడు ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న వకుల్ జిందాల్

GNTR: జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీవోలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.