అపర్ణ అమృతేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన
KNR: కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో అపర్ణ అమృతేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ, అభయాంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ హెూమం, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అభయ స్వామి విగ్రహా దాతగా గుజ్జుల ప్రసాద్ రెడ్డి వ్యవహరించారు. ప్రసాద్ రెడ్డిని పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు అభినందించారు.