పోలవరాన్ని సందర్శించిన నిపుణుల బృందం

పోలవరాన్ని సందర్శించిన నిపుణుల బృందం

AP: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. అక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించింది. డయాఫ్రం వాల్ పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్ఠతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణుల బృందం రావడంతో..కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకాలేదు.