బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం

ప్రకాశం: దోర్నాల మండలంలోని చింతలలో వైసీపీ ఆధ్వర్యంలో ''బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ'' కార్యక్రమాన్ని మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచకుండా, హామీలను తుంగలో తొక్కారంటూ ప్రజలకు వివిరించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమని వెంకటయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.