మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

BDK: మత్స్యకారుల వలకు మొసలి చిక్కిన ఘటన అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువులో జరిగింది. గురువారం కొందరు వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్లగా, వలలో మొసలి ప్రత్యక్షమైంది. భయాందోళనకు గురైన స్థానికులు విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని గోదావరి నదిలో విడిచిపెట్టారు.