రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభం

రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు ప్రారంభం

కర్నూలు: అహోబిలంలో శ్రీలక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అహోబిలంలో సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజెంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరులు శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, నియోజికవర్గ వైసీపీ నాయకులు గంగుల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.