మానవత్వం చాటుకున్న కౌన్సిలర్!
VKB: కొడంగల్లోని పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా 2వ వార్డు కౌన్సిలర్ ఆర్.వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ అండగా నిలిచారు. తన తండ్రి రాములు జ్ఞాపకార్థం పోస్టాఫీస్ వద్ద వారందరికీ అల్పాహారం, తాగునీరు పంపిణీ చేశారు. ఎండలో వేచి ఉండే వారికి ఉపశమనం కలిగించేలా ఆమె చేసిన ఈ సేవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.