తుది మెరుగులు దిద్దుకుంటున్న బమృక్ నుద్దౌలా
HYD: పాతబస్తీకి మణిహారంగా చారిత్రక చెరువు బమృక్ నుద్దౌలా నిలుస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇన్ లెట్లు, ఔట్ లెట్ల నిర్మాణాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చెరువుకు ఎంతో చరిత్ర ఉందని, దానిని పునరావృతం చేసేలా చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలతో పాటు నీడనిచ్చే చెట్లను నాటాలన్నారు.